స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అండర్-14 బాలికల జట్టు 3వ స్థానం
Posted on 03-01-2024
News image

2023 డిసెంబర్ 27 నుండి 30 వరకు వేలూరులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అండర్-14 బాలికల జట్టు 3వ స్థానం సాధించింది.


ఇది టీమ్ ఛాంపియన్‌షిప్ కాబట్టి, అనంతపూర్‌కు చెందిన టీమ్ కెప్టెన్ జి శ్రీహ (1421) ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇతర టీమ్ ప్లేయర్స్ త్రిపురాంబిక (1396) , కటారి సజ్యోస్త్నా (1279) , అస్మిత అనిమి, శ్రావ్యశ్రీ భీమరశెట్టి (1455) అందరూ కూడా బాగా ఆడి జట్టుకు విజయం చేకూర్చారు.


మొత్తం ఆరు రౌండ్ల పోటీలు నిర్వహించగా 17/24 పాయింట్లతో మూడవ స్థానం కైవసం చేసుకున్నారు. 

          ఈ సందర్భంగా ఈ ఘనత సాధించిన అనంతపురం క్రీడాకారిణి శ్రీహ, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ (ఎంఆర్‌ఓ), శిరీషలను ఆల్‌ అనంతపురం చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఉదయ్‌ కుమార్‌ నాయుడు అభినందించారు. ఈ తరుణంలో ఈ విజయం తన కోచ్ ఆదిరత్న కుమార్ (DHII చెస్ అకాడమీ)కి దక్కుతుందని విజేత శ్రీహ పేర్కొంది.

తన విజయంలో తన తండ్రి కంబగిరి స్వామి కీలక పాత్ర పోషించారని అస్మిత అనిమి తెలిపింది.