భీమవరం ఇంటర్నేషనల్ ఫిడే ఓపెన్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2024 కు 20 మంది క్రీడాకారులు ఎంపిక
Posted on 26-03-2024
News image

2024 మార్చి 24 వ తేదీన అనంతపురంలోని కనకదాస కల్యాణ మండపం వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్-2024 పోటీలను ఏ1 చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో లక్ష రూపాయలు నగదు బహుమతితో నిర్వహించారు. 


మొత్తం ఆరు రౌండ్ల పోటీలను స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా 72 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.వివిధ కేటగిరిలో ప్రతిభ చూపి 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసామని మొత్తంగా లక్ష రూపాయల నగదు బహుమతిని ఎంట్రీ ఫీజు రూపంలో భీమవరంలో జూన్ 04-09 వరకు జరగబోయే ఇంటర్నేషనల్ ఫిడే ఓపెన్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2024 పోటీల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు.


ఎంపికైన 20 మంది క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ ఇంటూరి కిషోర్ నాయుడు, కనకదాస కళ్యాణ మండపం వెన్యూ స్పాన్సర్స్ పావురాలు జగదీష్ గారు, బండి కాశీ విశ్వనాథ్ గారు , శీనయ్య గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు , ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయకుమార్ నాయుడు, ఏ1 చెస్ అకాడమీ అధ్యక్షురాలు అమ్మినేని తులసమ్మ , టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ శ్రీమతి జొన్నగడ్డలు గౌతమి గారు తదితరులు పాల్గొన్నారు. 


 ఓపెన్ కేటగిరీ విభాగం

ప్రథమ స్థానం: మన్యు సాయి 

6/6 పాయింట్లు, తిరుపతి జిల్లా

ద్వితీయ స్థానం : మాధవ నాయుడు 

5/6 పాయింట్లు, అనంతపురం జిల్లా

తృతీయ స్థానం : అస్మిత అనిమి,

5/6 పాయింట్లు, అనంతపురం జిల్లా 

 నాలుగవ స్థానం: వెంకట శ్రీ చైతన్ రెడ్డి

ఐదవ స్థానం : అజయ్ కె

 ఆరవ స్థానం : చిల్లా కౌశిక్

ఏడవ స్థానం: ఎస్వి వెంకట సుధీంద్ర 

ఎనిమిదవ స్థానం: జొన్నగడ్డల నితీష్ చౌదరి

తొమ్మిదవ స్థానం: చింతకాయల నరేష్ కుమార్

పదవ స్థానం : యశస్విని అనిమి


ఏజ్ కేటగిరి ఛాంపియన్స్

బాలికల విభాగం

అండర్ 7 : షేక్ ఆసి అలీ

అండర్ 9 : ధన్య శ్రీ కోమల

అండర్ 11: రెడ్డమ్మ గారి తేజస్వి

అండర్ 13: కాశీ నౌమిక


బాలుర విభాగం

అండర్ 7 : యువ సిద్ధార్థ రెడ్డి

అండర్ 9: మునకల శ్రీ సాకేత్

అండర్ 11: కటారి వినూత్

అండర్ 13 : చక్రధర్ నాథ్

అండర్ 15 : సాయి చరణ్