రఘు సైనిక్ స్కూల్ వేదికగా ఏప్రిల్ 7వ తేదీన ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి సంయుక్త సౌజన్యంతో ఏ1 చెస్ అకాడమీ వారు ఆర్గనైజర్ గా , రఘు సైనిక్ స్కూల్ వారు స్పాన్సర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ -2024 ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ ఇంటూరి కిషోర్ నాయుడు తెలిపారు.
₹70,000/- నగదు బహుమతిని 40 నగదు బహుమతులుగా, 36 ట్రోఫీలను , పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారునికి ప్రోత్సాహక మెడల్ ను ఇస్తున్నట్లు స్పాన్సర్ రఘు సైనిక్ స్కూల్ డైరెక్టర్లు రాఘవేంద్ర , గురుప్రసాద్ , లోకేష్ తెలిపారు.చదరంగం ఆడటం వల్ల మేధో వికాసం కలుగుతుంది అని , అలాగే క్రీడాకారుల సౌకర్యార్థం ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు రఘు సైనిక్ స్కూల్ డైరెక్టర్లు తెలిపారు.
ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను రఘు సైనిక్ స్కూల్ డైరెక్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు గారు, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, సీనియర్ చెస్ కోచ్ మెహరాజ్ , టోర్నమెంట్ డైరెక్టర్ ఇంటూరి కిషోర్ నాయుడు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు ₹700/- ప్రవేశ రుసుమును +91 78938 78177 కు చెల్లించి www.apchess.org లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.
