స్పార్క్ చెస్ అకాడమీ 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్-2024 అనంతపురం జిల్లా క్రీడాకారుల ఎంపిక
Posted on 23-04-2024
News image

అనంతపురం నగరంలోని సాయినగర్ రెండవ క్లాస్ లో ఉన్న శ్రీ వర్ష హాస్పిటల్ లోని ఏ1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ని  వేదికగా అనంతపురం జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2024 ను ఏ1 చెస్ అకాడమీ వారు ఆర్గనైజర్ గా, సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు స్పాన్సర్ గా నిర్వహించిన అన్-రేటెడ్ క్రీడాకారుల రౌండ్ రాబిన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. 


ఓపెన్ విభాగం

ఛాంపియన్ : దర్శన్ . ఎన్ 5.5/6 పాయింట్లు

రన్నరప్ : మహంత్ . కె 4.5/6 పాయింట్లు


బాలికల విభాగం 

ఛాంపియన్: హరిచందన 4/6 పాయింట్లు

రన్నరప్ : షేక్ ఆసి అలీ 3/6 పాయింట్లు


            ఈ నలుగురు విజేతలు కూడా విజయవాడ వేదికగా ఈ నెల 25 నుంచి 30 తేదీ వరకు జరగబోయే స్పార్క్ చెస్ అకాడమీ 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్-2024 లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొంటారు. దీనికి సంబంధించిన 20,000/- ప్రవేశ రుసుమును స్పాన్సర్ డాక్టర్స్ సుప్రజా చౌదరి గారు సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేశారు. విజేతలకు మొమంటోను ముఖ్య అతిథి జాతీయ యువజన అవార్డు గ్రహీత బిసాతి భరత్ , ఏ1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ , ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు, స్పాన్సర్ సుప్రజా చౌదరి, చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున చేతుల మీదుగా అందజేశారు.

         అన్-రేటెడ్ క్రీడాకారులను కూడా రేటింగ్ టోర్నమెంట్లో పాల్గొని , రేటెడ్ క్రీడాకారులుగా తయారయ్యేలా అవకాశం కల్పించి ప్రోత్సహించాలనే ఈ సెలక్షన్ ను నిర్వహించినట్టు టోర్నమెంట్ కోఆర్డినేటర్లు గోవిందరాజులు, మరియు మెహరాజ్ తెలిపారు.