2024 జూన్ 1 న అఖిల భారత చదరంగ సమాఖ్య ( ALL INDIA CHESS FEDERATION) AICF మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య ( World Chess Federation) FIDE సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి హై స్కూల్ కి చెందిన విద్యార్థులు అక్కాతమ్ముళ్లు ఒకేసారి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ను సాధించి తాడిపత్రి పట్టణ చదరంగ చరిత్రలో నూతన రికార్డును సృష్టించారు.
క్రీడాకారుల వివరాలు:
రెడ్డమ్మగారి తేజస్వి 6th క్లాస్
ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ : 1516
రెడ్డమ్మగారి హేమ చరణ్ 4th క్లాస్
ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ : 1426
(అక్క & తమ్ముడు)
స్వస్థలం : తాడిపత్రి
విద్యాభ్యాసం : శ్రీవాణి హై స్కూల్, తాడిపత్రి
తల్లిదండ్రులు: కృష్ణవేణి, గృహిణి, రెడ్డమ్మగారి హరిప్రసాద్ రెడ్డి Stone Business
శిక్షకుడు: యస్. వి. సురేంద్రనాథ్ , తాడిపత్రి
అక్క సంవత్సరము నుంచి తమ్ముడు 6 నెలల నుంచి చదరంగంలో యస్. వి. సురేంద్రనాథ్ శిక్షణ పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు క్రీడాకారులను అభినందించారు.
