ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అనంతపురంలోని కళ్యాణ్ దుర్గం బైపాస్ దగ్గర గల ఆర్.కె. చెస్ అకాడమీ వేదికగా ఆదివారం నాడు నిర్వహించిన అనంతపురం జిల్లా అండర్-7 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2024 ఎంపిక పోటీలు ముగిసాయి అని టోర్నమెంట్ డైరెక్టర్ కిషోర్ కుమార్ మరియు చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున తెలిపారు.
చిన్నారులు అందరూ కూడా ఎత్తుకు పై ఎత్తులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
బాలుర విభాగంలో నాలుగు రౌండ్లు మరియు బాలికల విభాగంలో మూడు రౌండ్లు పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహించారు.
అండర్-07 ఓపెన్ విభాగం
ఛాంపియన్: ఈశ్వర్ ప్రసాద్ వి 4/4 పాయింట్లు
రెండవ స్థానం: మయాంక్ అర్జున్ 3/4 పాయింట్లు
అండర్-07 బాలికల విభాగం
ఛాంపియన్: కాశి సమిక 3/3 పాయింట్లు
రెండవ స్థానం : ఎర్రం దివ్య 2/3 పాయింట్లు
విజేతలకు బహుమతులను టోర్నమెంట్ డైరెక్టర్ కిషోర్ కుమార్ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున , నేషనల్ ఆర్బిటర్ కమల్ అందజేశారు.
వీరందరూ కూడా విజయనగరంలో ఆగస్టు 3-4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-07 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్స్ -2024 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
