ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్ 11 బాలికల చెస్ చాంపియన్షిప్-2024 ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకున్న అనంతపురం జిల్లా క్రీడాకారిణి యశస్విని అనిమి
Posted on 28-07-2024
News image

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జులై 27 , 28 న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్ 11 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్స్-2024 ఎంపిక పోటీల్లో బాలికల చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ను అనంతపురం జిల్లా క్రీడాకారిణి యశస్విని అనిమి 5.5/6 పాయింట్లతో కైవసం చేసుకుని అక్టోబర్ లో తెలంగాణలో జరగబోయే జాతీయస్థాయి అండర్ 11 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్స్-2024 పోటీల్లో బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించబోతోంది. ఈ సందర్భంగా క్రీడాకారుణిని , వారి తల్లిదండ్రులను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు అభినందించారు.