అనంతపురం జిల్లా అండర్-9 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్స్ -2024
Posted on 09-09-2024
News image
 అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ దగ్గర గల ఆర్.కె. చెస్ అకాడమీ వేదికగా ఆదివారం నాడు నిర్వహించిన అనంతపురం జిల్లా అండర్-9 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2024 ఎంపిక పోటీలు ముగిసాయి అని ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు మరియు టోర్నమెంట్ డైరెక్టర్ కిషోర్ కుమార్ మరియు చీఫ్ ఆర్బిటర్ బి.సి. కమల్ తెలిపారు.

చిన్నారులు అందరూ కూడా ఎత్తుకు పై ఎత్తులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

బాలుర విభాగంలో మూడు రౌండ్లు మరియు బాలికల విభాగంలో నాలుగు రౌండ్లు పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహించారు.

అండర్-09 ఓపెన్ విభాగం
ఛాంపియన్: యం. శ్రీ సాకేత్ 2.5/3 పాయింట్లు 
రన్నరప్ : రెడ్డమ్మగారి హేమ చరణ్ రెడ్డి 2.5/3 పాయింట్లు
మూడవ స్థానం: సంజయ్ సాహుల్ 2/3 పాయింట్లు


అండర్-09 బాలికల విభాగం
ఛాంపియన్: షోరోన్ బ్లేస్సీ 4/4 పాయింట్లు
రన్నరప్ : పల్లినేని హారిక చౌదరి 3/4 పాయింట్లు 
మూడోస్థానం ; ఎర్రం దివ్య 3/4 పాయింట్లు

         విజేతలకు బహుమతులను టోర్నమెంట్ డైరెక్టర్ కిషోర్ కుమార్ , నేషనల్ ఆర్బిటర్ కమల్, కోచ్ హుస్సేన్ ఖాన్ అందజేశారు.

వీరందరూ కూడా విజయనగరంలో ఈనెల 21-22 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-09 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్స్ -2024 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున టాప్-2 క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారని ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.