ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ సాధించిన అనంతపురం జిల్లా క్రీడాకారులు
Posted on 02-10-2024
News image

ప్రపంచ చదరంగ సమాఖ్య (FIDE) మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య (AICF) సంయుక్తంగా అక్టోబర్ ఒకటవ తారీఖున విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల జాబితాలో అనంతపురం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు.

            అనంతపురం నగరంలోని ఏ1 చెస్ అకాడమీ శిక్షకుడు మరియు క్రీడాకారుడు గంతి మెహరాజ్ ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ విభాగంలో 1634 రేటింగ్ ను, తాడిపత్రి కి చెందిన అన్నాచెల్లెలు పల్లినేని మోక్షిత్ చౌదరి ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ విభాగంలో 1490 ను పల్లినేని హారిక చౌదరి ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ విభాగంలో 1492 ను కైవసం చేసుకున్నారు.


అన్నా చెల్లెల ప్రతిభ

తాడిపత్రిలోని శ్రీవాణి హై స్కూల్లో చదువుతున్న అన్నా చెల్లెలు వారి చెస్ కోచ్ యస్.వి. సురేంద్రనాథ్ ( క్రిష్ చెస్ అకాడమీ) వారి శిక్షణలో ఒకేసారి ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ ను సాధించారు.

క్రీడాకారుడు పేరు : పల్లినేని మోక్షిత్ చౌదరి , 7 వ తరగతి

క్రీడాకారిణిని పేరు: పల్లినేని హారిక చౌదరి , 4 వ తరగతి 

తల్లి తండ్రులు : P. వెంకట శివ ప్రసాద్ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు; సునీత (గృహిణి)

చెస్ కోచ్ : సురేంద్రనాథ్, 

క్రిష్ చెస్ అకాడమీ, తాడిపత్రి.

....

పేరు: గంతి మెహరాజ్

తల్లిదండ్రులు: ఆషియా, రఫీ 

స్వస్థలం : పామిడి

            మెహరాజ్ ఇప్పటికే పలు జిల్లాస్థాయి , రాష్ట్రస్థాయి స్టేట్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొని పలు విజయాలు సాధించాడు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఏ1 చెస్ అకాడమి లో చదరంగ శిక్షకుడిగా పలు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. మెహరాజ్  భీమవరంలో సెప్టెంబర్ నెలలో జరిగిన ఇంటర్నేషనల్ బిలో 1600 ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో ప్రతిభ చూపి మెహరాజ్ ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ విభాగంలో 1634 రేటింగ్ ను సాధించారు.

        ఈ సందర్భంగా అనంతపురం నగరంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, గౌరవ చైర్మన్ బాలరాజు, అధ్యక్షుడు శివకుమార్ , కోశాధికారి ఇంటూరి కిషోర్ నాయుడు క్రీడాకారులను అభినందించారు.