అనంతపురం నగరంలోని సాయినగర్ రెండవ క్రాస్ లో ఉన్న ఏ1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అనంతపురం జిల్లా అండర్-15 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్ -2024 ఎంపిక పోటీలు ఏ1 చెస్ అకాడమీ వారు ఆర్గనైజర్ గా నిర్వహించారు.
అండర్ 15 ఓపెన్ విభాగం:
ప్రథమ స్థానం : కె. సాయి యశస్ 2.5/3 పాయింట్లు
ద్వితీయ స్థానం : పి. సంజయ్ సాహుల్ 2/3 పాయింట్లు
తృతీయ స్థానం: జొన్నగడ్డల నితీష్
నాల్గవ స్థానం: ధీరజ్
అండర్ 15 బాలికల విభాగం
ఛాంపియన్: ఏ సుకృత 3/3 పాయింట్లు
ద్వితీయ స్థానం : షారోన్ బ్లెస్సీ 2/3పాయింట్లు
తృతీయ స్థానం: కాశి నౌమిక
నాల్గవ స్థానం: త్రిపద
రెండు విభాగాల్లోనూ టాప్ -4 విజేతలు కూడా గుంటూరులో ఈనెల 15,16, 17 తేదీల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్ 15 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్-2024 ఎంపిక పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు , అధ్యక్షుడు శివకుమార్, కోశాధికారి ఇంటూరి కిషోర్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
విజేతలకు మెడల్స్ ను టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ మరియు నేషనల్ ఆర్బిటర్ కాశి రవీంద్ర , గవర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.
