అండర్ 13 నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్-2025 టైటిల్ ను కైవసం చేసుకున్న అనంతపురం జిల్లా క్రీడాకారుడు సామ్యూల్ స్టీఫెన్ నోబుల్
Posted on 21-01-2025
News image

ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అఖిల భారతీయ చదరంగ సమాఖ్య మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య వారి సౌజన్యంతో కాకినాడలోని పెద్దాపురం శ్రీ ప్రకాష్ స్కూల్ వేదికగా నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్స్-2025 అండర్-7,9,11,13,15,17 ఓపెన్ మరియు బాలికలు పోటీలు, జనవరి 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగాయి.      

       దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి 1200 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లు పాల్గొన్నారు.

       స్విస్ లీగ్ పద్ధతిలో జరిగినటువంటి ఈ పోటీల్లో అండర్ 13 ఓపెన్ విభాగంలో 181 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనటువంటి సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ మొత్తం 9 రౌండ్లకు గాను 8 పాయింట్లలతో ( 7 గెలుపు, 2 డ్రా, 0 ఓటమి) ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్-2025 మరియు ఫిడే వరల్డ్ స్కూల్ చెస్ చాంపియన్షిప్-2025 పోటీలకు అర్హత  సాధించాడు. 

         ముఖ్య అతిధుల చేతుల మీదుగా ట్రోఫీని పదివేల నగదు బహుమతిని అందుకున్నాడు.

క్రీడాకారుడు పేరు : సామ్యూల్ స్టీఫెన్ నోబుల్

తల్లిదండ్రులు: రెబెకా ( ప్రభుత్వ ఉపాధ్యాయిని) , సుందర్ రాజు, (సూపర్వైజర్ పోస్టల్ డిపార్ట్మెంట్ ) 

పాఠశాల : ఏడవ తరగతి , నారాయణ స్కూల్ ద్వారకా బ్రాంచ్ 

చెస్ కోచ్ లు : హుస్సేన్ ఖాన్ ( అనంతపురం) , రామరాజు ( హైదరాబాద్) 

            ఇప్పటికే వివిధ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి మరియు రేటింగ్ టోర్నమెంట్లలో ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారుడు ఈసారి అండర్ 13 నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్-2025 పోటీల్లో ఛాంపియన్షిప్ టైటిల్ ను కైసం చేసుకున్నందుకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ గారు , గౌరవ చైర్మన్ బాలరాజు గారు, కోశాధికారి ఇంటూరి కిషోర్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తదితర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.