ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అఖిల భారతీయ చదరంగ సమాఖ్య మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య వారి సౌజన్యంతో కాకినాడలోని పెద్దాపురం శ్రీ ప్రకాష్ స్కూల్ వేదికగా నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్స్-2025 అండర్-7,9,11,13,15,17 ఓపెన్ మరియు బాలికలు పోటీలు, జనవరి 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగాయి.
దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి 1200 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లు పాల్గొన్నారు.
స్విస్ లీగ్ పద్ధతిలో జరిగినటువంటి ఈ పోటీల్లో అండర్ 09 బాలికల విభాగంలో 88 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనటువంటి అరవ విశ్వాణి మొత్తం 9 రౌండ్లకు గాను 7 పాయింట్లలతో ( 5 గెలుపు, 4 డ్రా, 0 ఓటమి) రన్నరప్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
క్రీడాకారిణి పేరు: అరవ విశ్వాణి
తల్లిదండ్రులు: హేమనవ్యత ( గృహిణి) , రవిచంద్ర ( ఎలక్ట్రికల్ ఇంజనీర్)
తరగతి : మూడవ తరగతి మాంటిస్సోరి పాఠశాల గుంతకల్లు
చెస్ కోచ్: వడ్డి దుర్గాప్రసాద్
ప్రోత్సాహం: నాగార్జున కర్ణాటకమ్, మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్
ముఖ్య అతిధుల చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీని నగదు బహుమతిని అందుకుంది.
అన్-రేటెడ్ క్రీడాకారిణిగా ప్రతిష్టాత్మ పోటీల్లో పాల్గొన్నప్పటికీ ఏడు మంది రేటెడ్ , ఇద్దరు అన్-రేటెడ్ క్రీడాకారిణులతో తలపడి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్-2025 మరియు ఫిడే వరల్డ్ స్కూల్ చెస్ చాంపియన్షిప్-2025 పోటీలకు అర్హత సాధించిన అనంతపురం జిల్లా క్రీడాకారిణి అరవ విశ్వాణి ని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ గారు , గౌరవ చైర్మన్ బాలరాజు గారు, కోశాధికారి ఇంటూరి కిషోర్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు , ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నాగార్జున కర్ణాటకమ్ తదితర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
