ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ సాధించిన అనంతపురం జిల్లా క్రీడాకారులు త్రిపద , సంజయ్ సాహుల్
Posted on 01-02-2025
News image

         ప్రపంచ చదరంగ సమాఖ్య (FIDE) మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య (AICF) సంయుక్తంగా ఫిబ్రవరి ఒకటవ తారీఖున విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల జాబితాలో ఎప్పటిలానే అనంతపురం జిల్లా నుంచి కొత్త చెస్ క్రీడాకారులు సత్తా చాటారు.


పిడుగు సంజయ్ సాహుల్ 

వయస్సు : 9 సంవత్సరాలు

తల్లిదండ్రులు : జయశ్రీ గృహిణి , 

శ్రీనివాసులు , ప్రభుత్వ ఉపాధ్యాయుడు,

విద్యాభ్యాసం: 4 వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్ ఏడవ బ్రాంచ్ అనంతపురం 

శిక్షకులు: సీనియర్ నేషనల్ ఆర్బీటర్ గోవిందరాజులు 

ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు 

ఏ1 చెస్ అకాడమీ

            కేవలం 8-9 నెలల వ్యవధిలోనే ప్రపంచ చదరంగ సమాఖ్య చే మూడు విభాగాల్లోనూ కూడా ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సాధించాడు.

క్లాసికల్ : 1459 |ర్యాపిడ్ : 1401 | బ్లిట్జ్ : 1514

2025 జనవరి 21-24 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో జరిగిన 13వ నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్స్ -2024-25 పోటీల్లో అండర్ 11 విభాగంలో పాల్గొన్న పిడుగు సంజయ్ సాహుల్ మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను 5 పాయింట్లు ( 4 గెలుపు, 2 డ్రా , 3 ఓటమి) సాధించి, 63వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.అలాగే వివిధ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో పాల్గొని రాణించాడు.


క్రీడాకారిణి పేరు: యు. త్రిపద

తల్లిదండ్రులు : మాలతి గౌరీ, 

యు శ్రీనివాసులు . బిజినెస్

విద్యాభ్యాసం : 7వ తరగతి , కేశవరెడ్డి స్కూల్ , సాయి నగర్ బ్రాంచ్ 

చెస్ కోచ్ : ఆర్. కె. కిషోర్ , 

ఆర్. కె. చెస్ అకాడమీ

         జనవరిలో విజయవాడలో జరిగిన బిఎంకేయు 2వ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫెడై రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనిపించి ఇంటర్నేషనల్ ఫిఢే క్లాసికల్ రేటింగ్ 1427 ను కైవసం చేసుకుంది.


ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ గౌరవ చైర్మన్ బాలరాజు కోశాధికారి కిషోర్ నాయుడు , ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు క్రీడాకారులని అభినందించారు.