అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించిన అనంతపూర్ జిల్లా క్రీడాకారులు
Posted on 02-05-2025
News image

ప్రపంచ చదరంగ సమాఖ్య (FIDE) మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య (AICF) సంయుక్తంగా మే 1వ తేదీన విడుదల చేసిన చదరంగం జాబితాలో ఎప్పటిలాగే మన అనంతపురం జిల్లా నుంచి కొత్త క్రీడాకారులు సత్తా చాటారు.   అనంతపురం నగరానికి చెందిన నందకిషోర్ , గుంతకల్లుకు చెందిన కార్తికేయన్ రాణించారు.

         

అనంతపురం నగరానికి చెందిన చదరంగం శిక్షకుడు మంచికంటి నంద కిషోర్ రెండవ అంతర్జాతీయ నమ్మ బెంగళూరు

ఫిడే క్లాసికల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చూపి ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ 1501 ను సాధించాడు.


క్రీడాకారుడు పేరు : ఉత్తికంటి కార్తికేయన్

తల్లిదండ్రులు : వేదవతి(టీచర్), ఓబులయ్య(టీచర్) 

స్కూల్ : భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ , గుంతకల్

2వ అంతర్జాతీయ నమ్మ బెంగుళూరు బ్లిట్జ్ టోర్నమెంట్ లో ప్రతిభ చూపి ఇంటర్నేషనల్ ఫిడే బ్లిట్జ్ రేటింగ్ 1497 ను సాధించాడు.

చదరంగ శిక్షకులు : అనిల్ కుమార్ ,రామారావు


 ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు, అధ్యక్షుడు శివకుమార్, కోశాధికారి ఇంటూరి కిషోర్ , ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు అభినందించారు.