YSR FIDE TOURNAMENT LOGO INAUGURATION
ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్ గా , శ్రీ చెస్ అకాడమీ కో-ఆర్గనైజర్ గా ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు విశాఖపట్నం లోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించబోయే వైయస్సార్ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2021 లోగో ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస రావు అడిషనల్ కమిషనర్ & డి.ఓ.ఎస్ , గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఛీఫ్ అడ్వైజర్ ఆనంద్ రెడ్డి , టోర్నమెంట్ డైరెక్టర్ వి. శ్రీకాంత్ , ఆల్ విశాఖ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠ , అధ్యక్షుడు బాలకృష్ణ రావు తదితరులు పాల్గొని టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు మాట్లాడుతూ కరోనా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్లాసికల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్ మన విశాఖపట్నం లో జరగడం హర్షణీయమని , ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెస్ ఇన్ స్కూల్స్ ప్రాజెక్టు లో భాగంగా , ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగ భారతి అనే పేరుతో జి.వి.యం.సి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులందరికీ చదరంగ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాస రావు గారు చదరంగం అభివృద్ధికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని , ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో దేశవ్యాప్తంగా 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఒక గ్రాండ్ మాస్టర్, ఇద్దరు ఇంటర్నేషనల్ మాస్టర్స్ , ఒక ఫిడే మాస్టర్ , 140 మందికి పైగా ఇంటర్నేషనల్ ఫిడే రేటెడ్ ప్లేయర్స్ పాల్గొంటున్నారని , టోర్నమెంట్ ప్రైజ్ ఫండ్ రూ.3,01,000/- అని, జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ వల్ల జిల్లాలో చదరంగ వ్యాప్తికి దోహదపడుతుందని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ కి సలహాలు సూచనలు ఇస్తూ, టోర్నమెంట్ సన్నాహాలను పర్యవేక్షించారు. ఈ టోర్నమెంట్ కు చీఫ్ ఆర్బిటర్ గా ఇంటర్నేషనల్ ఆర్బిటర్ రవిచంద్రన్ గారు వ్యవహరిస్తున్నారని ఆల్ విశాఖ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠ తెలిపారు. ఇటువంటి కార్యక్రమానికి తక్కువ వ్యవధిలో అనుమతి మంజూరు చేసి, సహాయ సహకారాలు అందించిన మేయర్ గారికి , మున్సిపల్ కమిషనర్ గారికి టోర్నమెంట్ డైరెక్టర్ వి. శ్రీకాంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు