1st YSR ALL INDIA OPEN FIDE RATING CHESS TOURNAMENT-2021 started Successfully.
ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్ గా , శ్రీ చెస్ అకాడమీ కో-ఆర్గనైజర్ గా , ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వై.ఎస్.ఆర్ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్-2021 ఘనంగా ప్రారంభమయ్యాయి.పోటీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ముత్తం శెట్టి శ్రీనివాసరావుగారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్యులు , పర్యాటక , సాంస్కృతిక మరియు యూత్ అడ్వాన్స్మెంట్ విభాగం మాట్లాడుతూ చదరంగం ఆడటం వలన మేధోసంపత్తి , మానసిక వికాసం పెరుగుతుందని వయో, లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆడే ఉత్తమ క్రీడ చదరంగం అని , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల చదరంగ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. శ్రీ కె.వి.వి. శర్మ గారు , అధ్యక్షుడు , ఆంధ్ర చెస్ అసోసియేషన్ గారు మాట్లాడుతూ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రవేశపెట్టిన చెస్ ఇన్ స్కూల్ ప్రాజెక్ట్ లో భాగంగా చదరంగభారతి పేరుతో విశాఖ పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత చదరంగ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని , అతి త్వరలో అంతర్జాతీయ స్థాయిలో చెస్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని , దీనికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుండి 282 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం అందులో ఒక గ్రాండ్ మాస్టర్ ఇద్దరు ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఇద్దరు మాస్టర్స్ 141 మంది ఇంటర్నేషనల్ ఫిడే రేటెడ్ ప్లేయర్స్ పాల్గొనటం హర్షణీయమని తెలిపారు.వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ , స్మార్ట్ సిటీ గారు మాట్లాడుతూ వైయస్సార్ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్-2021 విశాఖపట్నం వేదిక కావడం ఆనందంగా ఉందని చదరంగ క్రీడాభివృద్ధి ఎల్లవేళల తమ సహాయ సహకారాలు ఉంటాయి తెలిపారు.పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భీమారావు, కార్యదర్శి, ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఆనంద్ రెడ్డి, ఛీఫ్-అడ్వైజర్, ఆంధ్ర చెస్ అసోసియేషన్, టోర్నమెంట్ డైరెక్టర్ వి.శ్రీకాంత్ , ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠ రావు , అధ్యక్షుడు బాలకృష్ణ రావు , టోర్నమెంట్ చీఫ్-ఆర్బిటర్ రవిచంద్రన్ పాల్గొన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ రసవత్తర చెస్ చాంపియన్ షిప్ పోటీలలో టోర్నమెంట్ ప్రైజ్ ఫండ్ ₹3,01,000/- నగదు బహుమతిని ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.